టాలీవుడ్‌లో ఒక్క‌టే హాట్‌టాపిక్‌… ఆచార్య‌ను రామ్‌చ‌ర‌ణ్ వ‌దిలేశాడా…!

మెగాస్టార్ చిరంజీవి – కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమా ఇప్ప‌ట‌కి రెండు సంవ‌త్స‌రాలుగా వార్త‌ల్లో ఉంటోంది. ఈ సినిమా అనుకున్న‌ప్ప‌టి నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదుర‌వుతూనే ఉంది. ముందు క‌థ సిద్ధం కాలేద‌న్నారు.. త‌ర్వాత హీరోయిన్ సెట్‌కాక కొద్ది రోజులు షూటింగ్ ఆగింది.. త‌ర్వాత త్రిష‌ను హీరోయిన్‌గా తీసుకున్నాక ఆమె త‌ప్పుకున్నారు. మ‌ళ్లీ కాజ‌ల్‌ను తీసుకున్నారు. ఇక ఇప్పుడు క‌రోనా నేప‌థ్యంలో షూటింగ్ వాయిదా ప‌డింది. మ‌ధ్య‌లో చిరుకు, కొర‌టాల‌కు కూడా ప్రాజెక్టు ప‌ట్ల అస‌హ‌నం వ‌చ్చింద‌న్న గుస‌గుస‌లు కూడా ఇండ‌స్ట్రీలో వినిపించాయి.

Ram Charan on about Chiranjeevi Acharya Movie

ఇక ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్ కొణిదెల ప్రొడక్షన్స్ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నిర్మాణంలో రామ్‌చ‌ర‌ణ్ అనాస‌క‌త్త‌తో ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక్క రూపాయి కూడా చ‌ర‌ణ్ ఖ‌ర్చు పెట్ట‌డం లేదని.. ఖ‌ర్చంతా మ్యాట్నీ ఎంట‌ర్టైన్‌మెంట్ వారే పెట్టుకుంటున్న‌ట్టు గుస‌గుస‌లు బ‌య‌ట‌కు పొక్కాయి. దీనిపై మ్యాట్నీ సంస్థ స్పందించి రెండు సంస్థ‌లు క‌లిసే ఖ‌ర్చు చేస్తున్నాయ‌ని కూడా చెప్పింది.

Chiranjeevi Acharya Movie Release Date, Story, Cast, Songs, First ...

ఇక తాజాగా మోష‌న్ పోస్ట‌ర్‌లో మాత్రం చ‌ర‌ణ్ పేరు కంటే కూడా కొణిదెల ప్రొడక్షన్స్, చిరు స‌తీమ‌ణి సురేఖ పేర్లు హైలైట్ అయ్యాయి. ఈ మోష‌న్ పోస్ట‌ర్ వ‌చ్చాక విన‌ప‌డుతోన్న టాక్ ఏంటంటే సినిమా నిర్మాణంలో చ‌ర‌ణ్ ఆస‌క్తి చూప‌డం లేద‌ని.. కేవ‌లం ఆచార్య‌క స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని అంటున్నారు. అయితే ఇందుకు మ‌రో కార‌ణం కూడా ఉందంటున్నారు. సైరా సినిమాతో చ‌ర‌ణ్‌కు న‌ష్టాలు ఎక్కువే వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లాంటి ప్రెస్టేజియ‌స్ మూవీలో బిజీగా ఉండ‌డంతో కూడా చ‌ర‌ణ్ ఆచార్య విష‌యంలో ఆనాస‌క్త‌తో ఉన్నాడ‌ని టాక్‌..?

Leave a comment