సుశాంత్ కేసులో సంచ‌ల‌న విష‌యాలు… రియా బ్లాక్‌మెయిల్‌.. ఫోన్ నెంబ‌ర్ బ్లాక్‌..!

బాలీవుడ్ దివంగ‌త న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ కేసును త‌వ్వుతోన్న కొద్ది ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికి తెలియ‌ని విష‌యాలు కూడా వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టికే సుశాంత్ తండ్రి కేకే సింగ్ త‌న కుమారుడు ఆత్మ‌హ‌త్య‌కు హీరోయిన్ అయిన సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియాచ‌క్ర‌వ‌ర్తే కార‌ణ‌మ‌ని ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజా విచార‌ణ‌లో రియా సుశాంత్‌ను మెంట‌ల్ హాస్ప‌ట‌ల్లో చేర్పించేందుకు ప్ర‌య‌త్నించింద‌ని తేలింది.

 

చండీఘ‌డ్‌లో త‌న సోద‌రి ఇంట్లో ఉన్న సుశాంత్‌ను ప‌దే ప‌దే ముంబై రావాల‌ని కూడా రియా ఫోన్ చేసింద‌ని తెలుస్తోంది. అలాగే త‌న‌కు సాయం చేయాల‌ని ప‌దే ప‌దే బ్లాక్ మెయిల్ చేసింద‌ని కూడా స‌మాచారం. ఇక సుశాంత్ చ‌నిపోయిన రోజు అయిన జూన్ 14న అత‌డి ఫోన్ నెంబ‌ర్‌ను రియా బ్లాక్ లిస్టులో కూడా పెట్టిన‌ట్టు పోలీసుల వ‌ద్ద ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయంటున్నారు. మ‌రి ఈ కేసులు ఇంకెన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట ప‌డ‌తాయో ? చూడాలి.

Leave a comment