షాక్ ఇస్తోన్న ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్‌… బాలీవుడ్ హీరోల‌కే దిమ్మ‌తిరిగేలా…!

ఇటీవ‌ల కాలంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రేంజ్‌, రేటు మారిపోయాయి. బాహుబ‌లి 1,2 సినిమాల‌తో పాటు ఆ త‌ర్వాత చేసిన సాహో సినిమాలు ప్ర‌భాస్‌కు తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ప్ర‌భాస్ తో సినిమా చేయాలంటేనే భారీ రెమ్యున‌రేష‌న్ స‌మ‌ర్పించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. ప్ర‌భాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా సినిమా అన్న ముద్ర ప‌డిపోయింది. ప్ర‌భాస్ సినిమా అంటేనే దేశ‌వ్యాప్తంగా తారాస్థాయిలో అంచ‌నాలు ఉంటున్నాయి.

 

బాహుబ‌లి, సాహో నార్త్‌లో కూడా హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు నార్త్‌లో కూడా ప్ర‌భాస్ క్రేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ప్ర‌భాస్ ప్రస్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత‌ ప్రభాస్ 21 సైన్స్ ఫిక్షన్ కాన్సెప్టుతో పాన్ ఇండియా రేంజులో తెరకెక్కనుంది. వైజ‌యంతీ మూవీస్ 50 సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కే ఈ సినిమాకు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 

ఇక ఈ సినిమాలో న‌టిస్తోన్నందుకు గాను ప్ర‌భాస్‌కు రు. 70 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుతోంద‌ని టాక్‌..? ఇది బాలీవుడ్ హీరోల‌కే షాక్ ఇచ్చేలా ఉంది. ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ కూడా ఉంద‌ట‌. ఒక సంవ‌త్స‌రంలో సినిమా కంప్లీట్ చేయాల‌ట‌.. లేక‌పోతే రెమ్యున‌రేష‌న్ మ‌రింత‌గా పెరుగుతోందని.. అలాగే అగ్రిమెంట్ కూడా కుదిరింద‌ని అంటున్నారు. ఈ రు. 70 కోట్ల‌లో కొంత రెమ్యున‌రేష‌న్‌తో పాటు కొంత బిజినెస్‌లో వాటాగా ఇవ్వ‌నున్నార‌ని అంటున్నారు. ఈ సినిమాల ప్ర‌భాస్ ప‌క్క‌న దీపికా ప‌డుకునే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా… ఆమెకే జీఎస్టీతో క‌లుపుకుని రు. 20 కోట్ల రెమ్యున‌రేష‌న్ ముడుతోంద‌ని అంటున్నారు.

Leave a comment