తెలంగాణ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మరణించారు. తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడు సార్లు సీపీఎం తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన్ను కుటుంబ సభ్యులు విజయవాడలోని కోవిడ్ హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు.
రాజయ్య పది రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. ఇక రాజయ్య చాలా నిరాడంబరుడు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసేవాడు. సీపీఐకి చెందిన ఆయన 1999, 2004, 2014లో భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏజెన్సీలోని పలు సమస్యలపై ఆయన ఎడతెరిపి లేకుండా పోరాటం చేశారు. ఆయన జీవితం అంతా ప్రజా పోరాటాల కోసమే కేటాయించారు.