Gossipsమ‌రో డైరెక్ట‌ర్‌కు చిరంజీవి మార్క్ షాక్‌... మెగా ఫ్యామిలీతో సినిమా అంతేగా...అంతేగా...!

మ‌రో డైరెక్ట‌ర్‌కు చిరంజీవి మార్క్ షాక్‌… మెగా ఫ్యామిలీతో సినిమా అంతేగా…అంతేగా…!

టాలీవుడ్ మెగాస్టార్ మ‌రో డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తాన‌ని చెప్పి ఇప్పుడు స‌డెన్ షాక్ ఇచ్చినట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా త‌ర్వాత ప్ర‌స్తుతం స‌క్సెస్‌ఫుల్ సినిమాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య టైటిల్‌తో వ‌స్తోన్న ఈ సినిమా త‌ర్వాత చిరు మ‌ళ‌యాళ హిట్ సినిమా లూసీఫ‌ర్ రీమేక్‌తో పాటు మెహ‌ర్‌ర‌మేష్‌, బాబి వంటి ద‌ర్శ‌కులతో సినిమాలు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ లిస్టులో మెహ‌ర్ ర‌మేష్ పేరు ఉండ‌డంతో అప్పుడే చాలా మంది షాక్ అయ్యారు. ఈ డిజాస్ట‌ర్ ద‌ర్శ‌కుడితో చిరంజీవి సినిమా చేయ‌డ‌మా ? ఇది న‌మ్మేలా లేదే అనుకున్నారు. ఇప్పుడు అదే నిజం అయ్యింది.

 

సాహో ద‌ర్శ‌కుడు సుజీత్‌తోనే చిరు లూసీఫ‌ర్ రీమేక్ చేస్తాడ‌ని నిన్న‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ ప్రాజెక్టును సుజీత్ డ‌వ‌ప‌ల్ చేసిన విధానం న‌చ్చ‌క‌పోవ‌డంతో చిరు లైట్ తీస్కొన్నాడ‌ట‌. అందుకే సుజీత్ సైతం వేరే ప్రాజెక్టుకు సైన్ చేశాడ‌ని అంటున్నారు. ఇక చిరు చెప్పిన లిస్ట్‌లో ఉన్న మెహర్ రమేష్‌కు కూడా చిరు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముందు మెహ‌ర్ చెప్పిన స్టోరీ లైన్ బాగుంద‌ని.. డ‌వ‌ల‌ప్ చేయ‌మ‌ని చెప్పిన చిరు.. ఫుల్ స్టోరీ విన్నాక ఇది నాకు సూట్ కాదు.. వేరే హీరోతో చేయ‌మ‌ని ఓ ఉచిత స‌ల‌హా ఇచ్చిప‌డేశాడ‌ట‌.

 

దీంతో మెహ‌ర్ స‌డెన్ షాక్ అయినట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మెగా ఫ్యామిలీతో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు ఓ ప‌ట్టాన ఓకే అవ్వ‌దు. ఇప్పుడు మెహ‌ర్ ర‌మేష్ విష‌యంలోనూ అదే జ‌రిగింద‌న్న టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా మెహ‌ర్‌తో సినిమా క్యాన్సిల్ కావ‌డంతో మెగా అభిమానులు మాత్రం ఖుషీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news