పూరి జగన్నాథ్ -మహేష్ కాంబోలో వచ్చిన పోకిరి, జనగణమన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత పూరి వరుస ప్లాపుల్లో ఉండడంతో మహేష్ తనకు ఛాన్స్ ఇవ్వలేదన్న అసంతృప్తి అయితే పూరికి ఉంది. అందుకే ఓ సారి తన కోపం పట్టలేక మహేష్ హిట్ డైరెక్టర్లకే ఛాన్స్ ఇస్తాడని… ప్లాపుల్లో ఉన్నవాళ్లను పట్టించుకోడన్నట్టుగా ఓపెన్ అయిపోయాడు. ఏదేమైనా ఈ ఇద్దరి గ్యాప్ అలాగే ఉంది.
ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ సైతం మహేష్‌పై అలక పాన్పు ఎక్కినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వన్ ప్లాప్ అయ్యాక సుకుమార్ మరో హిట్ సినిమా మహేష్‌కు ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. మహర్షి సినిమాకు ముందు చర్చలు జరపగా సుక్కు కథపై మహేష్ సంతృప్తి చెందలేదు. తర్వాత ఏమైందో వంశీ పైడిపల్లితో మహర్షి చేశాడు. ఇక సరిలేరు తర్వాత కూడా వంశీ పైడిపల్లితోనే మరో సినిమా చేయాల్సి ఉండగా వంశీ చెప్పిన కథ నచ్చకపోవడంతో డ్రాప్ చేసి పరశురాంతో సర్కారు వారి పాటకు కమిట్ అయ్యాడు.
వంశీ కూడా కాస్త నిరాశతో ఉండగానే ఇప్పుడు సుక్కు కూడా అదే బాటలో ఉన్నాడని అంటున్నారు. మహేష్ రెండు మూడు సార్లు తన కథ విషయంలో సంతృప్తి చెందకపోవడంతోనే సుక్కు వెంటనే బన్నీ దగ్గరకు వెళ్లి పుష్పను ఓకే చేయించుకున్నాడు. ఇక ఇప్పటకీనూ మహేష్ – సుక్కు మధ్య సోసోగానే సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు మహేష్ – సుక్కు అభిమానులు మాత్రం వీరిద్దరు అలకవీడి సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల దుమ్మురేగడం ఖాయమంటున్నారు.