MoviesV ట్రైల‌ర్‌తోనే నాని ర‌చ్చ చేసేశాడుగా... ఫినిషింగ్ ట‌చ్ కేకే

V ట్రైల‌ర్‌తోనే నాని ర‌చ్చ చేసేశాడుగా… ఫినిషింగ్ ట‌చ్ కేకే

నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కాంబినేష‌న్లో మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా వి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో మార్చిలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే క‌రోనా నేప‌థ్యంలో వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ రావ‌డంతో చివ‌ర‌కు ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. నివేద థామ‌స్‌, అదిథిరావు హైద‌రీ హీరోయిన్లుగా న‌టించారు. ఇక సెప్టెంబ‌ర్ 5న థియేట‌ర్ల‌లోకి దిగుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్ ఈ రోజు రిలీజ్ చేశారు.

ఎలా ఫినిష్ చేద్దాం అంటూ ఈ సినిమాలో ఉన్న ఓ డైలాగ్‌ను గుర్తు చేస్తూ నాని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. హ‌లో మైక్ టెస్టింగ్ 123, 123 అంటూ ఏం చేయాల‌న్నా ఎంట‌ర్టైనింగ్‌గా చేయాల‌న్న‌దే నా పాల‌సీ అన్న వాయిస్‌తో ట్రైల‌ర్‌ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో నాని సైకో కిల్ల‌ర్‌గా న‌టించాడ‌ని అంటున్నారు. ట్రైల‌ర్ ఆద్యంత స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ అంశాల‌తో ఆక‌ట్టుకుంది. ఇక ఫైన‌ల్‌గా ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ కాకూడ‌దు అన్న మాట రాకూడ‌ద‌న్న మాట‌తో ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చారు.

ఓవ‌రాల్‌గా చూస్తే ఈ ట్రైలర్ వైవిధ్యంగాను అందులోను ఊహించని విధంగా ఉందని చెప్పాలి. అయితే ద‌ర్శ‌కుడు మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను తెర‌కెక్కిస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి హైలైట్ అయ్యింది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ వి ట్రైల‌ర్‌తో అంచ‌నాలు పెంచేసింది. ఇక సినిమా ఎలా ఉంటుందో ?  చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news