ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చెన్నై ఎంజీఎం హాస్పటల్ వర్గాలు లేటెస్ట్ బులిటెన్ రిలీజ్ చేశాయి. ఆదివారం ఆయన ఆరోగ్యం కాస్తా కుదుట పడిందని ఎంజీఎం వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్లాస్మా చికిత్స విధానంతో బాలు ఆరోగ్యం మెరుగు పడినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక మరో రెండు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉండాలని కూడా వైద్యులు సూచించారు. ఇక చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని కూడా ఆయన చెప్పారు.
అలాగే ఆదివారం సాయంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ కూడా సాయంత్రం మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. తన తండ్రి ఆరోగ్యం కుదుటపడిందని.. అందర్నీ గుర్తు పడుతున్నారని చెప్పారు. తన తల్లి కూడా బుధవారంలోపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని తెలిపారు. ఇక బాలు త్వరగా కోలుకోవాలని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ట్వీట్ చేశారు. మీ స్వరం మళ్లీ ప్రతిధ్వనించాలని… మీరు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నాం అంటూ కమల్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.