Gossipsఓటీటీ బాట‌లో వి సినిమా.. రిలీజ్ డేట్ వ‌చ్చేసింది...!

ఓటీటీ బాట‌లో వి సినిమా.. రిలీజ్ డేట్ వ‌చ్చేసింది…!

క‌రోనా నేప‌థ్యంలో యావ‌త్ సినిమా ప్ర‌పంచం సంక్షోభంలో ఉంది. సినిమా షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతున్నాయో ? ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ? కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే దిల్ రాజు నిర్మాణంలో నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కాంబినేష‌న్లో తెర‌కెక్కిన వి సినిమా సైతం ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం వెయిటింగ్‌లో ఉంది. మార్చి 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా క‌రోనా నేప‌థ్యంలో నాలుగైదు నెల‌లుగా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించగా నాని విలన్‌గా న‌టిస్తున్నాడు.

 

ఇక ఇప్ప‌టికే టీజ‌ర్‌, రెండు పాట‌ల‌తో ఆక‌ట్టుకున్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న వి ను నిర్మాత దిల్ రాజు ఆన్‌లైన్ ప్లాట్‌పామ్‌లోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే నాని విను థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య చిన్న గ్యాప్ క్రియేట్ అయ్యింద‌న్న గుస‌గుస‌లు కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ త్వ‌ర‌లోనే రిలీజ్ చేసి.. ఓటీటీలో రిలీజ్ చేస్తార‌ని.. ఈ నెలాఖ‌రులోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ఉంటుంద‌ని అంటున్నారు. నివేదా థామస్, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news