Politicsబ్రేకింగ్‌: ఎస్పీ బాలు ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

బ్రేకింగ్‌: ఎస్పీ బాలు ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య ప‌రిస్థితిపై చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రి హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌స్తుతానికి నిల‌క‌డ‌గానే ఉంద‌ని కూడా ఆసుప‌త్రి వ‌ర్గాలు పేర్కొన్నాయి. బాలు ఆరోగ్య ప‌రిస్థితిపై ఆయ‌న త‌న‌యుడు చ‌ర‌ణ్ స్పందించారు. త‌న తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నార‌ని.. త్వ‌ర‌లోనే బాలు పూర్తి ఆరోగ్యంతో మ‌నంద‌రి ముందుకు వ‌స్తార‌ని ఆయ‌న త‌న‌యుడు ఎస్పీ.చ‌ర‌ణ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇక ఆయ‌నకు కోవిడ్‌-19 పాజిటివ్ రావ‌డంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

 

బాలుకు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో పాటు ఆరోగ్యం రెండు రోజుల క్రితం విష‌మించ‌డంతో ఐసీయూలో ఉంచి మ‌రీ చికిత్స చేస్తున్నారు. ఇక బాలు భార్య‌కు సైతం క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. బాలు కుటుంబ స‌భ్యులు అంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news