టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్‌ను హీరోగా నిలదొక్కుకునేలా చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఆకాష్‌ను ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని చివరకు తానే డబ్బులు పెట్టుబడి పెట్టి మరీ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆకాష్ తొలి సినిమాకే పూరికి పెద్ద లాస్ వచ్చిందన్న కామెంట్లు కూడా ఇండస్ట్రీలో వినిపించాయి.
ఇక ప్రస్తుతం పూరీ తనయుడు ఆకాష్‌తో రొమాంటిక్ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ రొమాంటిక్ సినిమాలో మాజీ హీరోయిన్ సిమ్రాన్ కూడా నటిస్తోంది. ఆమె మోడ్రన్, రొమాంటిక్ అత్తగా ఈ సినిమాలో కనిపించనందని తెలుస్తోంది. ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడం కోసం ఈ విషయన్నిదాచారట. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న కేతిక శర్మకు సిమ్రాన్ తల్లిగా నటిస్తుందట. ఇక ఆకాష్‌కు సిమ్రన్‌కు మధ్య వచ్చే సీన్లు దుమ్ము రేపుతాయట.
ఓవరాల్‌గా అత్త వర్సెస్ అల్లుడు పోరు ఓ రేంజ్లో ఉంటుందట. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ రొమాంటిక్ సినిమాలో ఘాడమైన ప్రేమ సన్నివేశాలు ఉంటాయంటున్నారు. ఇక గతంలో బాలయ్యతో సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, గొప్పింటి అల్లుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సిమ్రాన్ మళ్లీ చాలా రోజుల తర్వాత రీ మోడ్రన్ అత్తగా రీ ఎంట్రీ ఇస్తోంది. మరి మోడ్రన్ అత్తగా సిమ్రాన్ వెండితెరను ఎలా రంజింప చేస్తుందో ? చూడాలి.