Gossipsప్ర‌భాస్ హీరోయిన్‌తో బ‌న్నీ రొమాన్స్‌... అక్క‌డే చిన్న స‌స్పెన్స్‌...!

ప్ర‌భాస్ హీరోయిన్‌తో బ‌న్నీ రొమాన్స్‌… అక్క‌డే చిన్న స‌స్పెన్స్‌…!

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం ప‌ష్ప సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ – కొర‌టాల కాంబినేష‌న్లో కూడా ఓ సినిమా ఉంటుంద‌న్న ప్ర‌చారం ఉంది. ఇదిలా ఉంటే బ‌న్నీతో న‌టించేందుకు బాలీవుడ్ హీరోయిన్, ప్ర‌భాస్ సాహో భామ శ్ర‌ద్ధాక‌పూర్ ఓకే చెప్పింద‌న్న వార్త‌లు ఇటీవ‌ల వ‌చ్చాయి. అయితే ఆమె బ‌న్నీ ప‌క్క‌న స్టెప్పులు వేసేది పుష్ప సినిమాలో కాద‌ట‌. పుష్ప‌లో ఇప్ప‌టికే ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా ఎంపికైంద‌న్న టాక్ వ‌చ్చింది.

 

ఇంత‌లోనే బ‌న్నీ ప‌క్క‌న శ్ర‌ద్ధాక‌పూర్ న‌టిస్తోంద‌న్న వార్త‌ల‌తో అది ఐటెం సాంగ్ అయ్యి ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే బ‌న్నీ ప‌క్క‌న శ్ర‌ద్ధ న‌టించేది పుష్ప సినిమాలో కాద‌ట‌. పుష్ప కంప్లీట్ అయిన వెంట‌నే బ‌న్నీ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆచార్య సినిమా చేస్తోన్న కొర‌టాల అది కంప్లీట్ చేసుకుని బ‌న్నీ సినిమా డైరెక్ట్ చేస్తాడు. ఆ సినిమాలోనే ఓ స్పెష‌ల్ సాంగ్‌లో శ్ర‌ద్ధాతో క‌లిసి బ‌న్నీ స్టెప్పులు వేస్తాడ‌ట‌. దీంతో బన్నీ సినిమాలో బాలీవుడ్ భామ అనే వార్తలపై క్లారిటీ వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news