మిర్యాలగూడకు చెందిన ఓ యువతి తనపై 143 మంది ఏకంగా 5 వేల సార్లకు పైగా లైంగీక దాడికి పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ యువతి పంజాగుట్ట స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేయగా… దీనిపై దర్యాప్తును సీసీఎస్ పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆమె చెప్పిన ఆ 143 మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్ రెడీ చేశారు. ఇక ఈ 143 మందిలో రాజకీయ నాయకులు, వారి పీఏలు, టీవీ నటులు, పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు.
ఇక ఈ జాబితాలో చాలా మంది ప్రముఖులు ఉన్నారంటున్నారు. ఇక ఏబీవీపీ నాయకులు ఈ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తోంది. 27 మంది ఏబీవీపీ జెండాలతో కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. మరోవైపు పోలీసులు నామమాత్రంగా విచారణ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఈ నిందితుల నుంచి తనకు ప్రాణహానీ ఉందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. నాపై ఈ 143 మంది నిందితులు ఏళ్ల తరబడి సామూహికంగా అత్యాచారం చేశారని.. నాకు గర్భం వస్తే పలుమార్లు అబార్షన్లు చేయించారని ఆమె చెప్పింది.
ఇక సిగరెట్లతో ఒంటిపై కాలుస్తూ… నగ్నంగా వీడియోలు తీస్తూ… తుపాకీతో బెదిరిస్తూ ఎన్నోసార్లు రేప్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక తాను ఫిర్యాదు చేయడంతో తనకు అంగతకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కూడా ఆమె చెపుతోంది. ఇక బాధితురాలు పలువురితో మాట్లాడిన సంభాషణలు కూడా బయటకు లీక్ అయ్యాయి.