సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో కొందరు యువకులు పైశాచికత్వంతో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత అశ్లీల ఫోటోలను ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ముధోల్ మండల కేంద్రలో శనివారం చోటుచేసుకుంది.
పురుషోత్తం అనే వ్యక్తి ఓ వివాహితకు సంబంధించిన అసభ్యకరమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి స్థానికంగా వైరల్ అయ్యాయి. అక్కడ ఆ వివాహిత పరువు పోవడంతో పాటు స్థానికంగా ఆమె గురించే చర్చించుకుంటున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. భర్త ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.