టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వారి వంశాంకురం రానా-మిహిల వివాహం ఈనెల 8న జరగనున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్‌గా మారిన ఈ పెళ్లికి డేట్ దగ్గర పడుతుండడంతో ఇరువైపులా పెళ్లి పనులు వేగవంతం చేశారు. ముందుగా అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఈ పెళ్లి హైదరాబాద్‌లోని ఓ హోటల్ లేదా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లో చేయాలని భావించారు.
ప్రస్తుతం కరోనా వైరస్ జోరుగా విజృంభిస్తుండడంతో వేదికను మార్చారు. రోకా వేడక నిర్వహించిన రామానాయుడు స్టూడియోస్‌లో వివాహం కూడా జరగనుంది. దగ్గుబాటి వారింట్లో పెళ్లి అంటే సందడి మామూలుగా ఉండదు. అయితే కరోనా వల్ల సురేష్‌బాబు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే ఈ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారట. వివాహ వేడుకకు వచ్చే వారి సంఖ్య 30 కూడా దాటదని సమాచారం. సురేష్‌బాబు ఈ విషయంలో లేనిపోని రిస్క్ తీసుకోకూడదనే రానా పెళ్లి సింపుల్‌గా ప్లాన్ చేసినట్టు టాక్..?
ఇక రాజకీయ, సినిమా రంగాలకు చెందిన వారిని ఎవ్వరిని కూడా ఈ పెళ్లికి పిలవడం లేదని అంటున్నారు. కొవిడ్-19 కేసులు పెరుగుతుండడంతో ఎవరి ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టలేం. ఈ వేడుక చాలా చిన్నది కావొచ్చు.. కానీ అందమైనది అని సురేష్‌బాబు చెప్పారు.