భార‌త్‌కే గుడ్‌న్యూస్‌.. క‌రోనాకు అతి చ‌వ‌క మందు వ‌చ్చేసింది..

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనాకు అతి చ‌వ‌క అయిన మందు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్‌ను మ‌న దేశంలో ప్ర‌యోగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక భార‌త్ బ‌యోటెక్ రెడీ చేసిన వ్యాక్సిన్ సైతం మ‌న దేశంలో 12 హాస్ప‌ట‌ల్స్‌లో ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి అతి చవకైన ఔషధాన్నిలాంచ్ చేసింది. దేశంలో రోజుకు 50వేల కోవిడ్-19 కేసులు నమోదవుతున్న తరుణంలో స‌న్ ఫార్మా ఇచ్చిన వార్త పెద్ద ఊర‌ట లాంటిదే. ఫావిపివరవిర్ డ్రగ్ ఫ్లూగార్డ్ (200 మి.గ్రా)ను ప్రారంభించినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది.

 

ఈ టాబ్లెట్ ధ‌ర‌ను రు. 35 గా నిర్ణ‌యించారు. చాలా త‌క్కువ ధ‌ర‌లో ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు టాబ్లెట్ అందుబాటులోకి తీసుకు రావ‌డం దేశానికే పెద్ద ఊర‌టగా మారింది. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌మ మందును ల‌క్ష‌ల మందికి అందుబాటులోకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌న్ ప్ర‌తినిధులు చెప్పారు. తేలికపాటి నుండి మోడరేట్ లక్షణాలున్న కోవిడ్-19 రోగులకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని.. మ‌న‌దేశంలో ఆమోదించిన ఏకైక నోటియాంటీ-వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ అని ఫార్మా సంస్థ తెలిపింది.

Leave a comment