Gossipsమెగాస్టార్‌కు విల‌న్‌గా రానా... డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా..!

మెగాస్టార్‌కు విల‌న్‌గా రానా… డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ లిస్టులో లూసీఫ‌ర్ రీమేక్ ( వినాయ‌క్ డైరెక్ట‌ర్ అని ప్ర‌చారంలో ఉంది). ఇక మ‌రో ఇద్ద‌రు ముగ్గురు డైరెక్ట‌ర్లు చెప్పిన క‌థ‌లు కూడా చిరు విన్నారు. ఇక వ‌రుస హిట్ల‌తో ఉన్న క్రేజీ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి చెప్పిన క‌థ కూడా బాగా ఇంప్రెస్ చేయ‌డంతో ఆ సినిమా కూడా చేస్తాన‌ని అనిల్‌కు హామీ ఇచ్చాడ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ సినిమా ఎప్పుడు చేస్తాడు ?  ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంద‌న్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాలో రానాను విల‌న్‌గా తీసుకునే ఆలోచ‌న‌లో అనిల్ రావిపూడి ఉన్నాడ‌ట‌. ఈ విష‌యం మెగా కాంపౌండ్ వ‌ర్గాల నుంచి బ‌య‌ట‌కు లీక్ అయ్యింది. ఈ సినిమా క‌థ‌లో అన్ని కోణాలు చిరంజీవి బాగా న‌చ్చాయంటున్నారు. ఇక చిరు చేసిన సూచ‌న‌ల మేర‌కు క‌థ‌ను మ‌రింత మార్చేందుకు అనిల్ క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ట‌.

ఇక బాహుబ‌లి సినిమాలో రానా భళ్లాల‌దేవుడిగా విల‌న్ రోల్‌ను ఎలా పండించారో దేశం అంతా చూసింది. అయితే ఇప్పుడు చిరు సినిమాలో రానా విల‌న్ అంటే ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాలు చారిత్రక క‌థాంశంతో ఉంటాయా ?  లేదా సాధార‌ణ క‌థ‌యేనా ? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈ క‌థ‌పై అనిల్ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news