ఎప్పుడు కూల్‌గా తన పని తాను చేసుకు పోయే హీరో రామ్ ఇటీవల రమేష్ హాస్పటల్ విషయంలో అనవసరంగా ట్వీట్ చేసి ఇరుక్కున్నాడు. ఈ ట్వీట్ చేశాకే రామ్‌ను కొందరు సినీ లవర్స్‌తో పాటు వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం ప్రారంభమైంది. ఇక రామ్ వ్యక్తిగత విషయానికి వస్తే రామ్ పోతినేని స్వస్థలం విజయవాడ. విజయవాడలోనే చదువుకున్న రామ్‌కు ఓ అక్క కూడా ఉంది. వాస్తవంగా రామ్ అక్క గురించి ఎక్కడా బయటకు చిన్న మెసేజ్ కూడా బయటకు రాలేదు.
అయితే రామ్ అక్క ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ ఫొటోలు చూసిన వారు రామ్ అక్క అందాన్ని చూసి వావ్ అంటున్నారు. రామ్ అక్క పేరు పోతినేని మధు స్మిత. ఆమె కూడా ఓ ఆర్టిస్టే అని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇంతకు ఆమె భర్త ఎవరో కాదు హీరో శర్వానంద్ అన్న కళ్యాణే కావడం విశేషం. అంటే ఈ లెక్కన రామ్, శర్వానంద్ ఇద్దరూ బావబావమరుదులు అవుతారు.