Gossipsజ్యోతిక అక్క న‌గ్మాకు ఆ ఇద్ద‌రితో ఎఫైర్లు... ఆ స్టార్ హీరో...

జ్యోతిక అక్క న‌గ్మాకు ఆ ఇద్ద‌రితో ఎఫైర్లు… ఆ స్టార్ హీరో వాడుకుని వ‌దిలేశాడా..!

సూర్య భార్య జ్యోతిక అక్క న‌గ్మా గురించి ఈ త‌రం సినీ అభిమానుల‌కు తెలియ‌క‌పోవ‌చ్చు కాని… ఆమె 1990వ ద‌శ‌కంలో పాపుల‌ర్ హాట్ హీరోయిన్‌. ఆ మాట‌కు వ‌స్తే న‌గ్మా, జ్యోతిక‌, రోషిణి ముగ్గురు అక్కా చెల్లెల్లు హీరోయిన్లు.. వీరు ముగ్గురికి చిరంజీవితో న‌టించిన అరుదైన రికార్డు ఉంది. ఇదిలా ఉంటే న‌గ్మా కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో స్టార్ హీరోల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చింది. ఆ టైంలోనే న‌గ్మా కోలీవుడ్‌లో అప్పుడు స్టార్ హీరోగా ఉన్న శ‌ర‌త్‌కుమార్‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగించింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

అయితే శ‌ర‌త్‌కుమార్ న‌గ్మాను వాడుకుని ప‌క్క‌న పెట్టేసి  ఆ త‌ర్వాత మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ రాధిక‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ దెబ్బ‌తోనే న‌గ్మా చాలా రోజుల వ‌ర‌కు డిప్రెష‌న్‌లోకి వెళ్లింద‌ని.. కెరీర్‌లో వెన‌క‌ప‌డిపోయిందంటారు. ఆ త‌ర్వాత ఆమె అప్ప‌ట్లో స్టార్ క్రికెట‌ర్‌గా ఉన్న సౌరావ్ గంగూలీతో ప్రేమాయ‌ణం న‌డిపింది. వీరిద్ద‌రు ఏపీలోని కాణిపాకం ఆల‌యంలో పూజలు కూడా చేశారు.

ఆ త‌ర్వాత గంగూలీ భార్యకు ఈ ఎఫైర్ విష‌యం తెలిసి గంగూలీకి వార్నింగ్ ఇవ్వ‌డంతో న‌గ్మాకు, గంగూలీకి తేడా వ‌చ్చింది. అలా న‌గ్మా రెండు పెళ్లిళ్లు ఫెయిల్ అయ్యాయి. ఆ త‌ర్వాత ఆమె బోజ్‌పురి హీరోతో కూడా ప్రేమాయ‌ణం న‌డిపినా అది స‌క్సెస్ కాలేదు. ఆమెకు ఇప్ప‌ట‌కీ 45 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి కాకుండా ఒంట‌రిగానే ఉంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news