Sportsధోనీ రిటైర్మెంట్‌పై టార్చ్ బేర‌ర్ అంటూ రాజ‌మౌళి సంచ‌ల‌నం

ధోనీ రిటైర్మెంట్‌పై టార్చ్ బేర‌ర్ అంటూ రాజ‌మౌళి సంచ‌ల‌నం

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై ప‌లువురు ప్ర‌ముఖులు, క్రీడాభిమానులు, దేశ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సైతం ధోనీ రిటైర్మెంట్‌పై స్పందిస్తూ మీరు మ‌మ్మ‌ల‌ను అల‌రించారు. మీరు మిమ్మ‌ల‌ను గ‌ర్వ‌ప‌డేలా చేశారు… అంత‌క‌న్నా ఎక్కువ… మీరు చాలా క్ష‌ణాల్లో ప్ర‌శాంతంగా ఉండ‌డం ద్వారా మాకు స్ఫూర్తినిచ్చార‌ని.. ఈ నిర్ణ‌యం చాలా క‌ష్ట‌మైన క్ష‌ణం అని మీరు భ‌విష్య‌త్ త‌రాల‌కు టార్చ్ బేర‌ర్ అని రాజ‌మౌళి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు.

 

ఇక రాజ‌మౌళి ప్ర‌స్తుతం క‌రోనా భారీన ప‌డి కోలుకున్నాడు. ప్ర‌పంచం అంతా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న రాజ‌మౌళి క‌రోనా త‌గ్గిన వెంట‌నే ఈ సినిమా షూటింగ్ ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news