ఆలియా భట్ హీరోయిన్ అయిన తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో ఛాన్సులు దక్కించుకుని స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే యువనటుడు సుశాంత్ సిగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత ఆలియా బాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆమెపై తీవ్రమన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో కూడా ఆలియా సుశాంత్ గురించి చెడుగా మాట్లాడడం… ఇక ఇప్పుడు సుశాంత్ కేసులో ఆలియా తండ్రి మహేష్ భట్ పాత్ర పరోక్షంగా ఉన్నట్టు వార్తలు రావడంతో ఆలియాను నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.
రేపటి వేళ ఆమె ఓ సినిమాలో నటిస్తే ఆ సినిమాను చూడొద్దని కూడా ప్రచారం చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి టైంలో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ నుంచి ఆమెను తొలగించారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆలియాపై ఉన్న కాంట్రవర్సీలు తమ సినిమాకు నష్టం చేస్తాయనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారని రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆర్ ఆర్ ఆర్ నుంచి ఆలియా అవుట్ అయినట్టే అని అందరూ అనుకుంటున్నారు.
ఈ టైంలో రాజమౌళి ఆలియాను పక్కన పెట్టడం జరగలేదని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్` నుంచి ఆలియాను తొలగించాలనే ఆలోచనే తమకు రాలేదని రాజమౌళి క్యాంప్ స్పష్టం చేస్తోంది. అలాగే ఆలియా టీమ్ కూడా ఈ వార్తలను ఖండించింది. దీంతో ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా కంటిన్యూ అవుతుందన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది.