కరోనా నుంచి కోలుకున్నాక దర్శకధీరుడు రాజమౌళి తన తొలి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు మహాభారతం ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కరోనా వల్ల ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ? ఎప్పుడు ఎండ్ అవుతుందో ? అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఇంతలోనే రాజమౌళి ఫ్యామిలీ కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. వీరు కరోనా నుంచి కోలుకున్న వెంటనే రాజమౌళి తన తొలి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూలో ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి చెప్పడంతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన మహాభారతం గురించి కూడా చెప్పాడు. మహాభారతాన్ని తెరకెక్కించాలంటే బాహుబలి కంటే పదింతలు ఎక్కువ కష్టపడాలని చెప్పిన రాజమౌళి.. ఆ సినిమా తీయాలనుకుంటే 10 ఏళ్లు పట్టే అవకాశం ఉందని కూడా చెప్పాడు. ఇక ప్రభాస్ ఆదిపురుష్ సినిమా గురించి స్పందిస్తూ అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తోన్న టైంలో ఈ ప్రాజెక్టు రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఇక ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింతగా పెరుగుతుందని చెప్పిన రాజమౌళి .. ఆ సినిమా పోస్టర్ చూసిన వెంటనే తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. ఇక కరోనా నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ వచ్చే యేడాది ద్వితియార్థంలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.