లాక్డౌన్ సమయాన్ని టాలీవుడ్ సెలబ్రిటీలు తమ శుభకార్యాలకు ఎంచక్కా వాడుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలోనే పలువురు సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు రెండో ఇప్పటికే రెండో వివాహం చేసుకోగా… ఆ వెంటనే నిఖిల్, జబర్దస్త్ కమెడియన్, నటుడు మహేష్, హీరో నితిన్ పెళ్లిళ్లు జరిగాయి. ఇక రానా – మహీకా బజాజ్ పెళ్లి జరగగా.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె హీరోయిన్ నిహారిక ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇలా వరుసగా ఇండస్ట్రీ నటుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
ఇప్పుడు ఈ కోవలనే ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు, నటుడు రాజా చెంబోలు ఎంగేజ్మెంట్ జరిగిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఫిదా సినిమాలో వరుణ్‌తేజ్‌కు అన్నగా రాజా నటించాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, రణరంగం సినిమాల్లో కూడా నటించాడు. ఇక 2020లో కొత్త జీవితం ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పిన రాజా మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని చెప్పాడు. అయితే తనకు కాబోయే భార్య పేరు మాత్రం సస్పెన్స్‌లోనే ఉంచాడు.