వైజాగ్‌లోని పెందుర్తిలో నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడు కర్రి శ్రీకాంత్‌కు జరిగిన శిరోముండనం వీడియోతో సహా బయటకు రావడం సభ్యసమాజం నివ్వెరపోతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు మొత్తం ఏడుగురిని రిమాండ్‌లోకి తీసుకున్నారు. ఇక ఇప్పుడు నూతన్ నాయుడు మీ వాడండే మీవాడంటూ జనసేన, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్తే ఏపీ సోషల్ మీడియా వర్గాల్లో వైరల్‌గా మారింది.
సాక్షి దీనిపై స్పందిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమని, పరాన్న జీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి ఘోర అవమానం.. అతడికి శిరోముండనం చేయించారని రాసింది. ఇది జనసేన కార్యకర్తలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. జన సైనికులు గత రెండు మూడు రోజులుగా ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులకు తమ సొంత ఖర్చులతో సిలిండర్లు అందిస్తున్నారు. వీళ్లకు సోషల్ మీడియాలో కాస్త పాజిటివ్ కామెంట్లు వస్తోన్న టైంలో ఈ వార్త వాళ్లకు మండిపోయేలా చేసింది.
వీరు చేసిన మంచి పనులను కవర్ చేయని సాక్షి మీడియా ఇప్పుడు నూతన్ నాయుడు వార్తను బాగా హైలెట్ చేస్తోంది. దీంతో జనసేన టీం జగనన్న రాజ్యంలో దళితులపై దాడులు అనే వార్తను బాగా ప్రజెంట్ చేయాలని సాక్షికి కౌంటర్లు వేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నూతన్ నాయుడు వైఎస్ఆర్‌సీపీకే చెందిన వ్యక్తి అని జనసైనికులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక వైసీపీ పార్టీ విధివిధానాల రూపకల్పన చేసిన వారిలో నూతన్ కుమార్ కూడా ఉన్నాడని జనసేన కార్యకర్తలు చెపుతున్నారు.
గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో కూడా వైఎస్సార్ కుటుంబ సభ్యులు పార్టీ విధివిధానాలు రూపొందించాలని కోరితే తాను పెద్దలు సోమయాజులు గారి సూచనల మేరకు పనిచేశామని చెప్పాడు. అంతే కాకుండా సోయమాజులు గారు గైడెన్స్ ఇస్తే ఈ విధివిధానాల ప్రక్రియ తన ఆధ్వర్యంలోనే జరిగిందని నూతన్ నాయుడు చెప్పిన వీడియోను ఇప్పుడు జనసేన కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. అలా జనసైనికులు సాక్షికి కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా నూతన్ నాయుడు విషయంలో ఇప్పుడు జనసేన వర్సెస్ వైఎస్సార్‌సీపీ వాళ్లు వాళ్లల్లో వాళ్లే కుమ్మేసుకుంటున్నారు.