వైసీపీ సర్కార్ తో ఢీ అంటే ఢీ అని ఎడతెగని పంచాయితీని పెట్టుకున్న ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ కోర్టులో గెలిచి ఎట్టకేలకు జగన్‌ను ఓడించి మళ్లీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ పరిణామాం వైసీపీ వర్గాలకు మింగుడు పడడం లేదు. నిమ్మగడ్డ ఇప్పుడు తిరిగి తన పదవి తాను చేపట్టడంతో తనను ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో నిమ్మగడ్డ జగన్ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాడని సోషల్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఎస్ఈసీగా మళ్లీ పదవి చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్ ఫుల్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని సమాచారం. ఆయన పదవీ కాలానికి ఇంకా 8 నెలల సమయం ఉంది. ఇప్పుడు తనను తప్పించిన పదవీ కాలాన్ని పెంచాలని కూడా ఆయన కోరుతున్నారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ఎన్నికలు జరిగితే మాత్రం ఆయన వైఎస్సార్‌సీపీకి చుక్కలు చూపించడం ఖాయమని… ఇందుకు ఇప్పటికే ఆయన ప్లాప్ రెడీ చేసుకున్నారని కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీకి ఏకగ్రీవం అయిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆయన ఏదో ఒక సాకు చూపించి రద్దు చేసినా చేయవచ్చన్న టాక్ కూడా వస్తోంది.
ఆ ఎన్నికల కోడ్ చెల్లదని.. ఓ ఆర్డినెన్స్ తెచ్చి మళ్లీ కొత్త నోటిఫికేషన్‌తో ఎన్నికలు అంటే వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బే అనుకోవాలి. వైసీపీ ఏదైనా అంటే తాను రూల్స్ ప్రకారం వెళుతున్నానని చెప్పుకునే ఛాన్స్ ఆయనకు ఎలాగూ ఉంటుంది. ఏదేమైనా జగన్ ఈ ఎనిమిది నెలల్లో ఎన్నికలకు వెళితే మాత్రం వైసీపీని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టేంందుకు నిమ్మగడ్డ రెడీగా ఉన్నారని.. అప్పుడు వైసీపీ నేతలకు చుక్కలు కనపడనున్నాయి. ఒక వేళ మళ్లీ వైసీపీ దూకుడుగా వెళితే ఈ సారి ఆ పార్టీపై కోర్టుల నుంచి మరిన్ని మొట్టికాయలతో పాటు మరింత మైనస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.