బాలీవుడ్ పటౌడి యువరాణి సారా అలీఖాన్ నిత్యం ఏదో ఒక విషయంలో నెటిజన్ల ట్రోట్స్కు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆమెకు దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కు మధ్య ఏవేవో లింకులు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో ఆమె వార్తల్లోకి వారం రోజులు అయ్యిందో లేదో వెంటనే ఆమె మళ్లీ వార్తల్లోకి ఎక్కేసింది. ముస్లిం అయినా కూడా సారా ప్రతి పండగ జరుపుకుంటుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా వినాయకుడి వేడుకల వద్ద దిగిన ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి ‘గణపతి బప్పా మోరియా’ అంటూ క్యాప్షన్ పెట్టారు.ఈ పోస్టుతో నెటిజన్లు సారాను ట్రోలింగ్ చేస్తున్నారు. ముస్లిం అయిన సారా హిందూ పండగ జరుపుకోవడంపై కొందరు ఫైర్ అవుతున్నారు. సారా నువ్వు ముస్లింవా ? లేక హిందూవా ? అని ట్రోల్ చేస్తున్నారు. అయితే సారా అభిమానులు మాత్రం మతపరమైన విషయాలను తప్పుపట్టడం సరికాదని.. ఎవరి ఇష్టాఇష్టాలు వారికి ఉంటాయని చెప్పారు.
సారా అన్ని పండగలకు విలువ ఇచ్చి జరుపుకుంటారని చెప్పారు. ఇక కేదార్నాథ్ సినిమాతో తెరంగేట్రం చేసిన సారా సింబా, లవ్ ఆజ్కల్ సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె నటించిన కూలీ నెం.1 సినిమా విడుదల కోసం రెడీ అవుతోంది.