Gossipsలాక్‌డౌన్‌లో న‌య‌న్ సీక్రెట్ కాపురం... పెళ్లి గిల్లి లేదంటూ విఘ్నేష్‌కు షాక్‌..!

లాక్‌డౌన్‌లో న‌య‌న్ సీక్రెట్ కాపురం… పెళ్లి గిల్లి లేదంటూ విఘ్నేష్‌కు షాక్‌..!

సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌నతార‌, కోలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌ శివ‌న్ ఎప్ప‌టి నుంచో ప్రేమాయ‌ణంలో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలో న‌య‌న‌తార న‌టించింది. అప్ప‌టి నుంచి వీరి మ‌ధ్య మొద‌లైన స్నేహం.. విఘ్నేష్ తీరు ఆమెను ఆక‌ట్టుకోవ‌డంతో చివ‌ర‌కు న‌య‌న్ అత‌డి ప్రేమ‌కు లొంగిపోయింది. అంత‌కు ముందే హీరోలు శింబు, ప్ర‌భుదేవాతో న‌య‌న‌తార ప్రేమ వ్య‌వ‌హారాలు పెళ్లి వ‌ర‌కు వెళ్లి వెన‌క్కు వ‌చ్చేశాయి.

Did Nayanthara hint at breakup with Vignesh Shivan?

ఇక త‌న తాజా ఇంట‌ర్వ్యూలో విఘ్నేష్ త‌మ పెళ్లి గురించి మాట్లాడాడు. ఈ లాక్‌డౌన్ కాలంలో నయనతార, తాను క‌లిసి కొంత విలువైన స‌మ‌యం గ‌డిపామ‌ని.. త‌మ అనుబంధం విష‌యంలో ఇద్ద‌రం ఫుల్ ఖుషీగా ఉన్నామ‌ని కూడా చెప్పాడు. ఇక పెళ్లి చేసుకునేముందే తాము చేరుకోవాల‌నుకుంటోన్న ల‌క్ష్యాల గురించి ఆలోచ‌న చేశామ‌ని.. వాటిని సాధించాల్సి ఉంద‌న్నాడు. ఇక విఘ్నేష్ చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టే లాక్‌డౌన్ వేళ వీరిద్ద‌రు ఎంచ‌క్కా సీక్రెట్ కాపురం చేశార‌ని తెలుస్తోంది.

 

ఇక న‌య‌న‌తార‌కు ప్ర‌స్తుతం హీరోయిన్‌గా తిరుగులేని అవ‌కాశాలు వ‌స్తుండ‌డంతో… వాటిని వ‌దులుకునేందుకు ఆమె ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌. అందుకే ఎన్ని రోజులు అయినా ప్రేమించుకుందా.. బోర్ కొట్టాకే పెళ్లి అని కూడా ఆమె ఖ‌రాఖండీగా చెప్పేస్తోంద‌ట‌. ఇక విఘ్నేష్ కూడా చేసేదేం లేక ఆమెతో క‌లిసి ఉండ‌డం త‌ప్పా పెళ్లి అనే పేరు ఎత్తి ఎత్తి ఇక మాటే మ‌ర్చిపోయాడ‌ట‌. ప్రస్తుతం న‌య‌న‌తార‌ విఘ్నేష్ డైరెక్ట్ చేస్తోన్న కాదు వాకుల రెండు కాదల్ సినిమాతో పాటు నేత్రికన్ – మూకుత్తి అమ్మన్ – అన్నాత్తే సినిమాల్లో న‌టిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news