Gossipsఆ స్టార్ నిర్మాత‌తో గోపీచంద్‌కు ఎక్క‌డ చెడింది... అడ్వాన్స్ వెన‌క్కిచ్చేశాడా...!

ఆ స్టార్ నిర్మాత‌తో గోపీచంద్‌కు ఎక్క‌డ చెడింది… అడ్వాన్స్ వెన‌క్కిచ్చేశాడా…!

యంగ్ హీరో గోపీచంద్ ప్ర‌స్తుతం సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సిటీమార్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 80 శాతం కంప్లీట్ చేసుకుంది. మ‌రో 20 శాతం షూటింగ్ మిగిలిఉన్న ఈ సినిమాను త్వ‌ర‌లో రిలీజ్ చేయాల‌నుకున్నా క‌రోనా నేప‌థ్యంలో షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో కాస్త బ్రేక్ వ‌చ్చింది. ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌… గోపీచంద్‌, త‌మ‌న్నా ఇద్ద‌రూ కూడా వేర్వేరు క‌బ‌డ్డీ జ‌ట్ల‌కు కోచ్‌లుగా క‌నిపిస్తార‌ట‌. మెయిన్ క‌థ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంద‌ని, ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది సినిమాను తెర‌కెక్కించే తీరును బ‌ట్టే సినిమా సూప‌ర్ హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయ‌న్న టాక్ ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

Actor Gopichand and wife blessed with a baby boy | Telugu Movie ...

ఇదిలా ఉంటే గోపీచంద్ హీరోగా అగ్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సి ఉంది. ఈ సినిమాకు తమిళ ద‌ర్శ‌కుడు బిను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమా మొద‌లు కాకముందే ఆగిపోయింద‌ని స‌మాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఆగిపోయింద‌నే అంటున్నారు. దీంతో గోపీచంద్ తీసుకున్న అడ్వాన్స్ అంతా వెన‌క్కు ఇచ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎందుకు ఆగిపోయింద‌న్న కార‌ణం బ‌య‌ట‌కు రాక‌పోయినా హీరో గోపీ మాత్రం నిర్మాత ద‌గ్గ‌ర తాను తీసుకున్న అడ్వాన్స్ రు. 2 కోట్లు వెన‌క్కు ఇచ్చేశాడ‌ట‌.

Gopichand's injury did not hamper Chanakya's shoot

నిర్మాత బీవీఎస్ఎన్‌. ప్ర‌సాద్‌కు గోపీకి ఎక్క‌డో తేడా కొట్ట‌డం వ‌ల్లే ఈ సినిమా ఆగిపోయింద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇక గోపీ ఆశ‌లు అన్నీ సిటీమార్ మీదే ఉన్నాయి. ఇటీవ‌ల వ‌రుస ప్లాపుల్లో ఉన్న గోపీకి సిటీమార్ హిట్ అయితే మ‌ళ్లీ వ‌రుస ఛాన్సుల‌తో పాటు మార్కెట్ కూడా పెరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news