టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ నవనీత్ కౌర్ ప్రస్తుతం అమరావతి ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కోవిడ్ భారీన పడ్డ ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె తెలుగులో ఆర్పీ పట్నాయక్ శీను వాసంతి లక్ష్మీతో పాటు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగలో యంగ్ యమా పాటలో నర్తించింది. ఆ తర్వాత ఆమె బాబా రామ్‌దేవ్ మేనళ్లుడిని పెళ్లి చేసుకుని మహారాష్ట్ర అమరావతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా ఎంపీ అయ్యారు.
ఇక కొద్ది రోజుల క్రితం ఆమె మామ గంగాధర్ రానాకు కరోనా సోకింది. ఆ తర్వాత ఆయన నుంచి కుటుంబం అంతా కరోనా భారిన పడింది. ఇక నవనీత్ భర్తతో పాటు ఆమె పిల్లలు ప్రస్తుతం హాస్పటల్లో చికిత్స పొందుతుండగా వారి ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. అయితే నవనీత్ ఆరోగ్యం మాత్రం రోజు రోజుకు విషమిస్తోందని చెపుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇప్పటికే రెండు హాస్పటల్స్ నుంచి మార్చి ప్రస్తుతం ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆమె పిల్లలు పాజిటివ్‌గా రావడంతో వాళ్ల నుంచి ఈమెకు కూడా సోకింది. నవీనీత్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులతో పాటు నియోజకవర్గ ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.