భారత క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు, రాజకీయ, క్రీడాకారులతో పాటు ఎంతో మంది క్రీడాభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుండడంతో పాటు ధోనీ భారత క్రికెట్‌కు చేసిన సేవలు స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ధోనీ సతీమణి సాక్షిసింగ్ సైతం ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించడంతో పాటు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం గర్వపడేలా తన భర్త ఎన్నో విజయాలు అందించాడని.. అయితే ప్రజలు వాటిని మర్చిపోతారని.. ఆ క్షణంలో మాత్రం వారికి ఆయన అందించిన అనుభూతి మర్చిపోనిదని కూడా ఆమె తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చెప్పుకువచ్చారు.
మీరు సాధించిన విజయాలు చూసి ప్రతి ఒక్కరు గర్వపడాలి… మీరు రిటైర్మెంట్ ప్రకటించినందుకు… మీ విజయాలు ఆస్వాదించినందుకు తానెంతో గర్వపడుతున్నానని ఆమె చెప్పారు. మీకు ఎంతో ఇష్టం అయిన క్రికెట్‌కు గుడ్ బై చెప్పే క్రమంలో మీరు పడిన మనోవేదన ఎంతో నాకు తెలుసు అని కూడా ఆమె చెప్పారు. ఇక మీరు కన్నీళ్లను దిగమింగుకుని మరీ రిటైర్మెంట్ ప్రకటించారని అనుకుంటున్నానని కూడా ఆమె పేర్కొన్నారు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని.. మీ మాటలు.. మీ పనులు ప్రజలు మర్చిపోయినా మీరు క్రికెట్ ద్వారా వారిని ఎంతో సంతృప్తి పరిచారని కూడా ఆమె తెలిపారు.
ఇక సాక్షి భర్త రిటైర్మెంట్‌పై భావోద్వేగంతో స్పందించినా ఆమె ధోనీ విజయాలు, మాటలు మర్చిపోతారని పదే పదే చెప్పడం ధోనీ వీరాభిమానులకు నచ్చలేదు. తాము ధోనీని ఎప్పటకీ గుర్తుంచుకుంటామని వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ధోనీ సారథ్యంలోనే భారత్
2007లో టి20 ప్రపంచ కప్, 2011 ప్రపంచకప్‌తో పాటు 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.