Gossipsవామ్మో అన‌సూయ రేటు ఇంత పెంచేసిందే... కొండెక్కేసిందే...!

వామ్మో అన‌సూయ రేటు ఇంత పెంచేసిందే… కొండెక్కేసిందే…!

టాలీవుడ్‌లోనూ.. ఇటు బుల్లితెర మీద వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది. బుల్లితెర‌పై సూప‌ర్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఆ త‌ర్వాత వెండితెరం గ్రేటం చేసి ఇక్క‌డ కూడా మంచి క్యారెక్ట‌ర్ రోల్స్‌తో పాటు ఐటెం సాంగులు కూడా చేస్తోంది. ఇక ఇప్పుడు క‌రోనా ఉన్నా కూడా యాంక‌ర్‌గా ఆమెకు అవ‌కాశాలు, క్రేజ్ ఎంత మాత్రం త‌గ్గ‌లేదు. ఓవైపు తోటి యాంక‌ర్లు సుమ‌, ర‌ష్మీ, మంజూష‌, స‌మీర ఇలా చెప్పుకుంటూ పోతే కొత్త‌, పాత క‌ల‌యిక‌ల‌తో చాలా మంది యాంక‌ర్ల నుంచి పోటీ ఉన్నా కూడా అన‌స‌య డిమాండ్ ఎంత మాత్రం త‌గ్గ‌డం లేదు.

 

ప్ర‌స్తుతం ఆమె సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ న‌టిస్తోన్న పుష్ప సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంద‌ట‌. ఈ సినిమాలో ఆమె ఓ గిరిజ‌న యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌బోతోందంటున్నారు. చిత్తూరు – త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దు గ్రామాల‌కు చెందిన అడ‌వుల నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ ఉంటుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే స‌రిహ‌ద్దుల్లో ఉండే గిరిజ‌న అమ్మాయిగా అన‌సూయ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ట‌. ఇక ఈ సినిమాకు ఓకే చెప్పిన అన‌సూయ భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ని అంటున్నారు.

 

ఆమె రెమ్యున‌రేష‌న్ రోజుకు ల‌క్ష‌ల్లోనే ఉంద‌ని తెలుస్తోంది. అన‌సూయ ఎక్కువ డిమాండ్ చేసినా ఆమె పాత్ర‌కు ఉన్న ప్ర‌యార్టీతో పాటు ఆ పాత్ర‌కు ఆమె అయితేనే క‌రెక్టుగా సెట్ అవుతుంద‌ని.. నిర్మాత‌లు కూడా ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పార‌ట‌. రేటు విష‌యంలో ఆమె కింద‌కు దిగ‌డం లేద‌న్న టాక్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news