తెలుగు బుల్లితెర పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ 4 సీజన్ ఈ నెల చివరి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక షోలో పాల్గొనే కంటెస్టెంట్లు అందరూ ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నారు. 14 రోజుల పాటు క్వారంటైన్ ముగిసిన వెంటనే వీరిని హౌస్‌లోకి పంపనున్నారు. ఇక ఈ సారి బిగ్‌బాస్ సరికొత్త నిబంధనలతో ఉండనుంది. షోలోకు వెళ్లేవారు మినహా ఎవ్వరితోనూ నిర్వాహకులు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వరు. ఇక కంటెస్టెంట్లను కూడా ఈ సారి నాగార్జున స్టేజ్ మీద పరిచయం చేయడట.
అన్ని కూడా హౌస్‌లోనే నడుస్తాయి.. అంటే మనం టీవీలోనే అన్ని చూడాలి. అయితే ప్రమోషన్స్ కోసం వచ్చే సెలబ్రిటీలను మాత్రం వీడియో కాల్స్ ద్వారా బిగ్‌బాస్ హౌస్ సభ్యులతో మాట్లాడించేలా ఏర్పాటు చేశారట. ఇక కుటుంబ సభ్యులను పిలిచి కంటెస్టెంట్లను సర్‌ప్రైజ్ చేసే కార్యక్రమం కూడా ఈ సారి ఉండదంటున్నారు. ఏదేమైనా అన్ని కూడా వీడియో కాల్స్ ద్వారానే ప్లాన్ చేస్తున్నారు. అయితే టాస్క్‌లు మాత్రం మంచి రసవత్తరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక గతంలో బయటకు వచ్చిన వారు లీకులు ఇస్తున్నారు. దీంతో ఎలిమినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరన్నది తెలిసిపోయేది. దీంతో వారు తమ గేమ్ ప్లాన్ మారుస్తూ వుండేవాళ్లు. కానీ ఈసారి అలా లీక్స్ ఇచ్చే వీలుండదు. అలాగే బిగ్‍బాస్ ఎలిమినేషన్ సంగతులు కూడా ముందే లీక్ అయ్యే ఛాన్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నారట.