క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి సైరా సినిమా తర్వాత ఏ ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. కొద్ది రోజుల క్రితమే అక్కినేని హీరో అఖిల్‌తో సినిమా చేస్తున్నాడని.. ఈ సినిమా కోసం ఏకంగా రు. 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న పుకార్లు వచ్చాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రు. 50 కోట్లు దాటడంతో నిర్మాతలు డ్రాప్ అయ్యారు. సురేందర్‌రెడ్డికి రెమ్యునరేషన్ కాడ తేడా కొట్టిందట. దీంతో అఖిల్ ప్రాజెక్టు నుంచి సురేందర్ డ్రాప్ అయ్యాడు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సురేందర్ సినిమా అన్న టాక్ వచ్చింది.
ఇప్పుడు అల్లు అర్జున్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో మనోడు యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌తో ఓ ప్రాజెక్టు టేకాఫ్ చేస్తున్నాడట. సురేందర్ రామ్ కోసం పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని. ఓ అగ్ర నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తున్నాడని ఇండస్ట్రీ టాక్..?
రామ్ ప్రస్తుతం రెడ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. వాస్తవానికి అఖిల్‌తో సెట్ అవ్వాల్సిన సురేందర్‌రెడ్డి ప్రాజెక్టు రెమ్యునరేషన్ కాడ తేడా వచ్చే రామ్‌తో ఫిక్స్ అయ్యిందన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక రామ్ ఎనర్జీకి సరిపడే స్టోరీతో సురేందర్ రెడ్డి ఈ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట.