సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌మీద ఉండగానే మహేష్ ఎవరితో సినిమా చేస్తాడన్నది మాత్రం స్పష్టమైన క్లారిటీ అయితే లేదు. వాస్తవంగా రాజమౌళి తన ఆర్ ఆర్ ఆర్ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్టు మహేష్‌తోనే ఉంటుందని… దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కేఎల్. నారాయణ నిర్మించే సినిమాకు తామిద్దరం కలిపి పనిచేస్తామని చెప్పారు.
అయితే ఆర్ ఆర్ ఆర్ కంటే ముందుగానే మహేష్ మరో సినిమా ఖఛ్చితంగా ఫినిష్ చేసే ఉద్దేశంలో ఉన్నాడట. సర్కారు వారి పాటకు ఆరు నెలల టైం మాత్రమే పడుతుందని… ఆ వెంటనే మరో సినిమా చేసి రాజమౌళి ప్రాజెక్టులో జాయిన్ అవ్వాలన్నదే మహేష్ ప్లాన్. మరో వైపు ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ చేసేందుకే రాజమౌళికి మరో ఆరు నెలల టైం పట్టేలా ఉంది. ఆ తర్వాత మరో ఆరేడు నెలలు ఖచ్చితంగా గ్యాప్ తీసుకుంటాడు.
ఈ లెక్కన చూస్తే మహేష్‌కు మరో యేడాదిన్నర టైం ఉంది. ఈ లోగా సర్కారు వారి పాటతో పాటు మరో సినిమా సులువుగానే పూర్తి చేసుకోవచ్చు. అయితే ఎటొచ్చి ఇప్పుడు ఏ దర్శకుడు కూడా మహేష్‌ను మెప్పించే కథ చెప్పలేకపోతున్నారు. మహేష్‌ను ఇటీవల కాలంలోనే పలువురు టాప్ దర్శకులు అప్రోచ్ అయ్యి లైన్స్ కూడా వినిపించారని టాక్ వినిపించింది.
ప్రశాంత్ నీల్, లోకేష్ కనగ్ రాజ్ అలాగే సందీప్ వంగ, వంశీ పైడిపల్లి పేర్లు కూడా వినిపించాయి. అయితే ఈ కథలేవి మహేష్‌ను మెప్పించలేదని… అందుకే సర్కారు వారి పాట తర్వాత ఎవరితో చేస్తాడు అన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే అని తెలుస్తోంది.