టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు అంద చందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనోడు తన అందంతో ఎంతో మంది అమ్మాయిల నిజమైన కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఏ హీరోయిన్ అయినా సరే మహేష్ పక్కన ఒక్క సారి అయినా నటించాలనే కోరుకుంటుంది. బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఎంత గొప్ప హీరోయిన్ అయినా మహేష్ పక్కన నటించేందుకు ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలని కలలు కనడం కామనే. అంత గొప్ప అందం మహేష్‌బాబుది.
ఇప్పుడు మహేష్‌బాబు అందానికి ఓ ముదురు హీరోయిన్ ఫిదా అయిపోయింది. ఆమె ఎవరో కాదు పూజా కుమార్. కమల్‌హాసన్ పక్కన పలు సినిమాల్లో నటించిన పూజా కుమార్‌కు ఆంటీ హీరోయిన్ అన్న పేరుంది. ఆమె వయస్సు చాలా ఎక్కువ. అమెరికాలో ఉండే ఆమెకు కమల్ వరుస పెట్టి అవకాశాలు ఇస్తుండడంతో ఇక్కడకు వచ్చేసింది. ఇప్పుడు పూజా కుమార్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ తాను తెలుగులో మహేష్‌బాబు నటించిన సినిమాలు చూశానని.. అతడు సింప్లీ అమేజింగ్… తాను ఆయనకు ఓ పెద్ద ఫ్యాన్‌ను అంటూ పొగడ్తల వర్షం కురిపించేసింది.
మహేష్ కామెడీ, యాక్షన్ డ్రామా, ఎమోషన్, ఓవరాల్‌గా మహేష్ ఫెంటాస్టిక్ హీరో అంటూ తెగ పొగిడేసింది. హీరో అనే పదానికి అసలు సిసలు నిర్వచనమే మహేష్ అంటూ కొద్ది సేపటి వరకు ఆమె పొగడ్తలు ఆపలేదు. ఇక మహేష్‌ను ఇతర భాషా నటీమణులు కూడా ఎంతో మంది ఇష్టపడతారు. ఈ విషయాన్ని వారే గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు ఈ లిస్టులో పూజా కూడా చేరింది. మొత్తానికి ఈ ఆంటీ హీరోయిన్ మహేష్‌ను ఆకాశానికి మామూలుగా ఎత్తలేదు.