కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో పాటు 14 షరతులతో కూడిన బెయిల్‌ను ఆయనక కోర్టు మంజూరు చేసింది. బందరు వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మేకా భాస్కరరావు హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ హత్య ఆయన పర్యవేక్షణలోనే జరిగిందని భావించిన పోలీసులు ఆయన్ను తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి వద్ద అరెస్టు చేశారు.
హత్య జరిగిన తర్వాత ఆయన విశాఖ పారిపోయే క్రమంలో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు తుని వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి రెండు మూడు సార్లు ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా బెయిల్ రాలేదు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది.