అండ్ ద ఫ్రేమ్ ఈజ్..
భాయ్ ఎలా ఉన్నాడు..ఫస్ట్ డౌట్
సెట్ లో సైలెంట్ గా ఉంటే యాటిట్యూడ్ అంటారు
సీన్ లో పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తే సలామ్ రాకీ భాయ్ అంటారు
ఏది కావాలి?
కొన్నిసార్లునిశ్శబ్దం చేసే మేలు దగ్గర
తుఫానులు కూడా చిన్నబోతాయి
కలలు నెగ్గుకు వచ్చి కలతలు నివ్వెరపోతాయి..
రాకీ భాయ్ ఏం చేస్తున్నాడు..
ఆ బంగారు గనుల చెంత ఏ కలలను ఏరుకుంటున్నాడు..
ఏ తరహా కలలను నాటుతున్నాడు..
ఇదీ ఇవాళ్టి పోస్టర్ ఫ్రే్మ్ ..
వాడు యశ్.. యస్..దటీజ్ యశ్..
ఇప్పుడు దారి చూడు..దుమ్ము చూడు..ఒక్కడు వస్తున్నాడు..బస్సు పోతున్నంత వే గంగా ఒక్కడు పోతున్నడు..వేగంగా పోతు న్నడు..జీవితం ఏం నేర్పిందో చెప్పిపోతు న్నడు..ఒక నాటకం చివర్లో ఉన్నాడు..ఒక సినిమా మొదటి నుంచి చివరిదాకా ఉన్నా డు ..చప్పట్లు నవీన్ కుమార గౌడను మురిపిస్తున్నాయి. అవే చాలు..ఇంకేవీ వద్దు.. ఈలలు గోలలూ మరింత పెద్దవాణ్నిచేస్తు న్నయి..అవి చాలు..ప్రేమ పంచిన నేలకు, ప్రేమతో పెంచిన నాన్నకు వందనాలు చెల్లిస్తూ వాడు..ఇప్పుడు యశ్ గా రూపాంత రం చెందాడు. కన్నడ నాట నుంచి దేశం యావత్తూ తనవైపు చూసేలా ఐ ఓపెనర్ అ య్యాడు..వాడు యశ్..యస్..దటీజ్ యశ్..
ఈటీవీ అన్నం పెట్టింది
ప్రేమ బంధాలకు, జీవిత గంధాలకూ ఆనవాలుగా ఎనిమిదేళ్లు..జీవన సహచరి రాధికా పండిట్ ప్రేమలో ఉన్నాడు. ఈటీవీ సీరియల్ నంద గోకుల తో ప్రేమలో పడ్డాడు ..అదే సమయంలో ఈ పిల్లతోనూ ప్రేమలో పడ్డాడు.. ఆ ప్రేమ పెరిగి పెద్దదయింది.. అదే ప్రే మ సినిమా వరకూ సాగింది. సీరియల్ టు సినిమా.. జీవితం ఇచ్చినవన్నీ గొ ప్పగా లేవు..మలుచుకున్నవాటిలోనే మలుపులు వెతుక్కోవాలి అని నేర్పింది.. అదే సక్సెస్ మంత్ర,.. రాకీ భాయ్ ను రాజమౌళీ దీవించాడు. తనవంతు బాధ్యతగా బాలీవు డ్ వారికి కేజీఎఫ్ గురించి చెప్పాడు.. రాకీ భాయ్.. భాష కోసం..తన ప్రాంతం కోసం ఎంత తపన పడతాడో తన పాత్ర కోసం అందులో తనదైన ప్రత్యేక రీతిని ప్రదర్శించేం దుకూ అహరహం శ్రమిస్తాడు..
బడిలో నవ్విన నవ్వులు..నాటక సమాజంలో నవ్విన నవ్వులు.. టీలూ, సిగిరెట్లూ తెచ్చి ఇచ్చాక కూడా పొందిన నవ్వులు.. ఇవన్నీ ఆయన ను బలంగా ఎదిగేందుకు కారణం అయ్యాయి. ఇప్పుడు హీరో బాగున్నాడు.. విలన్ ఇంకా బాగుంటాడు.. హీరో బంగారు గనుల చెంత బంగరు కలలు నిజం చేసుకునేం దుకు ఇంకా ప్రయత్ని స్తున్నాడు. నాన్న ఇచ్చిన జీవితానికో విలువ, నమ్మి ఎంచు కున్న కెరియర్ కో విలువ, నమ్మకాలను రెట్టింపు చేసిన తన వారి కోసం ఏద యినా చేయాలన్న తపన ఇవే యశ్ కు ఆలంబనలు. అంతేనా! ఉత్తర కర్ణాటకలో ఓ ప్రాంతా నికి నీళ్లిచ్చిన ఘనత ఆ యనదే!ఇంకా ఎన్నో!చేయాల్సినవి సాధించాల్సినవి.. అనండిక సలామ్ రాకీ భాయ్ అని…
– రత్నకిశోర్ శంభుమహంతి