ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తిరిగి షూటింగ్‌లకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న సినిమాలు అన్ని వరుస పెట్టి సెట్స్‌మీదకు తీసుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే సంచలనాత్మక చిత్రం కేజీఎఫ్ 2 సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను తిరిగి సెట్స్‌మీదకు తీసుకు వెళుతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆగస్ట్ 26నుంచి బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు.
ఈ సినిమా సహనిర్మాత కార్తీక్‌గౌడ చెప్పిన దాని ప్రకారం కంఠరీవ స్టూడియోలో 10 రోజులు షూటింగ్ చేస్తే చాలా వరకు ఫినిష్ అవుతుందట. ఆ తర్వాత ఒక్క క్లైమాక్స్ మాత్రమే ఉందని చెపుతున్నారు. క్లైమాక్స్‌ను భారీగానే ప్లాన్ చేస్తున్నారట. కేజీఎఫ్ 1లో అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతి ఫైట్‌ను క్లైమాక్స్‌లా ఓ రేంజ్లో తీశారు. ఇప్పుడు కేజీఎఫ్ 2 క్లైమాక్స్‌ను సైతం భారీగా ప్లాన్ చేశారట. సంజయ్ దత్ మెయిన్ విలన్ గా అథీరా పాత్రలో కనిపిస్తున్నా.. క్లైమాక్స్‌లో పెద్ద మేజర్ పార్ట్ ఆయనకు ఉండదట.
కేజీఎఫ్ 1లో కూడా మెయిన్ విలన్‌ను కేవలం క్రూరత్వం చూపించేందుకే సీన్లు డిజైన్ చేశారు. ఇక ఇప్పుడు క్లైమాక్స్‌లో ఒకే ఒక కత్తివేటుతో అదికూడా జనాలందరూ చూస్తుండగానే జనాల మధ్యలోనుంచి వచ్చే యశ్ ఒక కత్తివేటుతో సంజయ్‌దత్‌ను అంతం చేయడంతో కథ ముగుస్తుందట. ఏదేమైనా కేజీఎఫ్ 2ను ఈ యేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.