మహానటితో కీర్తి సురేష్‌కి జాతీయ అవార్డు రావడంతో పాటు నటిగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆమె అంత బరువైన పాత్ర చాలా సులువుగా చేయడంతో సినీ ప్రేక్షకులు అందరూ ఆమెకు జేజేలు పలికారు. ఈ క్రమంలోనే ఆ ఇమేజ్ కాపాడుకునే క్రమంలో కీర్తి తెలుగులో కమర్షియల్ సినిమాలు ఒప్పుకోవడం లేదు. మహానటి లాంటి సినిమాలు ఎప్పుడూ రావు. అలాంటి పాత్రలు మాత్రమే చేయాలని ఆమె అనుకున్నా తప్పే. అవి కెరీర్ పరంగా గ్రోత్‌కు మంచివి కావు.
ఇక తమిళంలో పెంగ్విన్, తెలుగులో గుడ్‌లక్ సఖి, మిస్ ఇండియా సినిమాలు చేస్తోంది. పెంగ్విన్ డిజిటల్లో రిలీజ్ అయ్యి మెప్పించలేదు. ఇక గుడ్ లక్ సఖీ సినిమాలో ఆమె ఓ తండా పిల్లగా డీ గ్లామర్ క్యారెక్టర్ చేసింది. ఇది కూడా ఓటీటీ రిలీజ్. ఇక మిస్ ఇండియాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు థియేటర్లలో విడుదలయితే తప్ప సదరు హీరోయిన్ క్రేజ్ ఏమిటనేది అర్థం కాదు.
కానీ కొందరు మాత్రం ఆమెను రాంగ్ ట్రాప్ పట్టిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు మళ్లిస్తున్నారని… అయితే ఇవి ఓటీటీల్లో రిలీజ్ కావడంతో కీర్తి క్రేజ్ కాస్తా ఓటీటీకి పరిమితం అయిపోతోందన్న చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇప్పటకి ఆయినా ఆమె స్టార్ హీరోల సినిమా ఛాన్సులు ఒప్పుకుని… కమర్షియల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటే ఆమెకు కొన్నాళ్ల పాటు మంచి క్రేజ్ ఉంటుందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.