సుప్రీంకోర్టు కూతుళ్లకు ఆస్తి హక్కుపై సంచలన తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రుల ఆస్తిలో కూతుళ్ళకు సమాన హక్కులు ఉంటాయని సుప్రీం కోర్టు తన తాజా తీర్పులో స్పష్టం చేసింది. ఇక గతంలో ఈ నిబంధన ఉన్నా ఇది సక్రమంగా అమలు కావడం లేదు. ఈ క్రమంలోనే తన తాజా తీర్పులో సుప్రీం సవరించిన హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది.
తండ్రి సంపాదించిన ఆస్తిలో కొడుకులకు ఉండే సర్వ హక్కులు కూతుళ్ళకు వర్తిస్తాయని వెల్లడించింది. తండ్రి చనిపోయిన తర్వాత కూడా కూతుళ్ళకు ఈ హక్కులు వర్తిస్తాయని తీర్పునిచ్చింది. ఈ తీర్పు కుమారులకు పెద్ద షాక్ లాంటిదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుమార్తెలకు పెళ్లి అయ్యాక తండ్రికి దూరంగా భర్త దగ్గర ఉంటారు. అప్పుడు తల్లిదండ్రుల సంరక్షణ కొడుకులకే ఉంటుంది కదా ? అప్పుడు ఆస్తిలో కొడుకులతో పాటు కుమార్తెలకు ఎలా ? సమాన వాటా ఇస్తామని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది.