భక్తుడుకు బాబు బంపర్ ఆఫర్…ఈసారి అక్కడ టీడీపీ జెండా ఎగరడం ఖాయమే…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే జిల్లాల్లో కృష్ణా జిల్లా ముందు వరుసలో ఉంటుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఎక్కువ టీడీపీ జెండా ఎగురుతూనే ఉంటుంది. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి జిల్లా బాగా ఉపయోగపడుతుంది. 2014 ఎన్నికల్లో సైతం జిల్లాలో 16 సీట్లు ఉంటే టీడీపీ 10, బీజేపీ 1, వైసీపీ 5 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో జగన్ గాలి ఉండటం వల్ల, జిల్లాలో 2 సీట్లే గెలుచుకుంది. అయితే ఏ ఎన్నికలైన టీడీపీ ఆవిర్భావం దగ్గర నుంచి జిల్లాలో ఒకే ఒకసారి గెలిచిన నియోజకవర్గం ఒకటి ఉంది.

 

విజయవాడ వెస్ట్ సీటులో టీడీపీ అసలు ఒక్కసారే గెలిచింది. 1983లో ఒక్కసారి మాత్రమే ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది. రెండుసార్లు మాత్రం టీడీపీతో పొత్తులో భాగంగా సి‌పి‌ఐ అభ్యర్ధులు గెలిచారు. ఇక ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ టీడీపీ గెలిచిన సందర్భాలు లేవు. ఈ క్రమంలోనే ఈసారి ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో చంద్రబాబు భక్తుడుగా చెప్పుకునే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వెస్ట్ బరిలో దిగోచ్చని తెలుస్తోంది. బుద్దా బరిలో ఉంటే ఈసారి వెస్ట్‌లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని తెలుస్తోంది.

 

కాగా, మొన్న ఎన్నికల్లో వెస్ట్ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆమె విదేశాలకు వెళ్ళిపోయారు. అటు జలీల్ రాజకీయాల్లో పెద్ద యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో ఈసారి వెస్ట్‌ బరిలో బుద్దాని దింపాలని బాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయానికి జలీల్ తన కుమార్తెకు మళ్ళీ టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. అదే సమయంలో వెస్ట్ సీటు కోసం నాగుల్ మీరా ఎప్పటి నుంచి కాచుకుని కూర్చున్నారు. ఎంపీ కేశినేని నాని మద్ధతుదారుడుగా ఉన్న మీరా, నెక్స్ట్ ఎలాగైనా సీటు దక్కించుకోవాలని ఉద్దేశంతో ఉన్నారు. మరి వీరిని కాదని బాబు, బుద్దాకు సీటు ఇచ్చి, వెస్ట్‌లో టీడీపీ జెండా ఎగిరేలా ప్రయత్నిస్తారేమో చూడాలి.

Leave a comment