బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో నటి అంకిత లోఖండే ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద సంచలనం అయ్యింది. వీరు పెళ్లి చేసుకుంటారనుకున్న టైంలో ఏమైందో కాని ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్‌కు దూరమైన అంకిత కుశాల్ టాండన్‌కు దగ్గరైందన్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు సుశాంత్ మృతి తర్వాత రియా సుశాంత్ – అంకిత మళ్లీ కలుస్తున్నారని ఆరోపణ చేయడం.. దీనికి అంకిత ఖండన ఇవ్వడం జరిగింది.
తాజాగా ఓ జాతీయ మీడియాలో సుశాంత్‌కు దూరమైన అంకిత ఆ తర్వాత కుశాల్ టాండన్‌తో డేటింగ్ చేస్తోందని కథనం రాసింది. దీంతో కుశాల్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఆ కథనంపై తీవ్రంగా ఫైర్ అయిన కుశాల్ తనకు సుశాంత్, అంకితతో ఉన్న రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేశాడు. ఇదేం జర్నలిజమో అర్థం కావడం లేదు.. సుశాంత్, అంకితకు తాను బెస్ట్ ఫ్రెండ్‌ను అని.. సుశాంత్ నాకు సోదరుడు అని చెప్పాడు.
ఇక అంకిత కూడా తనకు మంచి స్నేహితురాలు అని… మీ బ్లేమ్ గేమ్‌లో నన్ను చేర్చవద్దని.. ఇలాంటి వార్త ప్రపంచంలో ఉన్నందుకు షాక్ అవుతున్నా అంటూ ట్వీట్ చేశాడు. ఏదేమైనా ఈ డేటింగ్ వార్తలతో కుశాల్‌కు చిర్రెత్తుకొచ్చిందనే చెప్పాలి.