Newsఅమెరికాలో ఇండియ‌న్లే టాప్‌... మ‌నోళ్ల‌ను కొట్టినోడే లేడెహే..!

అమెరికాలో ఇండియ‌న్లే టాప్‌… మ‌నోళ్ల‌ను కొట్టినోడే లేడెహే..!

ప్రపంచ దేశాల్లోని పలువురు విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారులకు అమెరికా వెళ్లాలన్నది కల. అమెరికా వెళ్లి ఉన్న‌త ఉద్యోగాలు చేయ‌డంతో పాటు అక్క‌డ సెటిల్ అవ్వాల‌ని క‌ల‌లు కంటూ ఉంటారు. అయితే అమెరికాలో స్థిర‌ప‌డుతోన్న విదేశీయుల్లో భార‌తీయులు ఆదాయంలో నెంబ‌ర్ వ‌న్ ప్లేసులో ఉన్నార‌ట‌. వివిధ రంగాల్లో మ‌నోళ్ల‌కు ఉన్న ప్ర‌తిభా పాట‌వాల‌తో అక్క‌డ స‌గ‌టు ఆదాయంలో మిగిలిన దేశాల ఉద్యోగుల కంటే చాలా ముందు ఉంటున్నార‌ట‌.

ఏటా అక్క‌డ అమెరిక‌న్‌ ప్రభుత్వం కమ్యూనిటీ సర్వే నిర్వహిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివ‌సిస్తోన్న స్థానికులు, విదేశీయుల మ‌ధ్య‌స్త కుటుంబాల ఆదాయ వివ‌రాలు న‌మోదు చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్థిరపడ్డ ఇండియన్‌ అమెరికన్ల ఆదాయం ఏటా అందరికంటే 1,00,500 డాలర్లుగా నమోదైంది. పొరుగు దేశాలైన శ్రీలంక.. నాలుగు, చైనా.. ఏడు, పాకిస్తాన్‌ .. ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొత్తం మీద టాప్‌ 10 దేశాల్లో తొమ్మిది ఆసియా దేశాలే కాగా.. స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలవడం విశేషం. ఏదేమైనా ఈ విష‌యంలో మ‌న భార‌తీయుల‌ను కొట్టేవాడే లెడ‌నే చెప్పాలి.

అమెరికాలో స్థిరపడిన వివిధ దేశాల మధ్య తరగతి కుటుంబాల ఆదాయం ఇలా ఉంది…

1- ఇండియన్ –   1,00,500

2 – ఫిలిప్పో –     83,300

3- తైవానీస్ –   82,500

4- శ్రీలంకన్ –  74,600

5- జపనీస్ –  72,300

6- మలేసియన్ – 70,300

7- చైనీస్ –  69,100

8- పాకిస్తాన్ –  66,200

9- వైట్‌–అమెరికన్లు  – 59,900

10- కొరియన్ – 59,200

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news