మనదేశంలో కరోనా వ్యాప్తి జోరుకు ఇప్పట్లో బ్రేకులు పడే ఛాన్సులు కనపడడం లేదు. తాజా లెక్కలతో దేశంలో కరోనా కేసులు 18 లక్షలు దాటేశాయి. ఇక కరోనా మరణాలు 38 వేలకు చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 12 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య రమారమీ 12 లక్షలుగా ఉంది. దేశంలో మహారాష్ట్ర, కర్నాకట, తమిళనాడు, ఢిల్లీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువుగా ఉన్నాయి.
ఈ జోరు ఇలాగే కొనసాగితే మరో పక్షం రోజుల్లోనే దేశంలో రోజుకు లక్ష కరోనా కేసులు నమోదు కావడం ఖాయమని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇప్పుడు భారత్ ఆశలు అన్నీ ప్రపంచమంతా ఆతృతగా చూస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ఈ ట్రయల్స్ ప్రస్తుతం తొలి దశలో ఉండగా.. ఇవి రెండు, మూడు దశల్లో కూడా సక్సెస్ అవ్వాల్సి ఉంది.