జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. వైవిధ్యమైన కాన్సెఫ్ట్లతో జబర్దస్త్ రేటింగ్‌ల దుమ్ము దులిపేస్తుంటాడు. ఇక అనసూయపై ఆది వేసే పంచ్‌లు, ఆమె పడి పడి నవ్వడాలు, ఆమెతో వేసే స్టెప్పులు ఇవన్నీ ఈ బుల్లితెర పాపులర్ ప్రోగ్రామ్ వీక్షకులకు మంచి వీనులవిందే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం బుల్లితెరమీదే కాకుండా ఆది అటు వెండితెర మీద కూడా మంచి ఛాన్సులే దక్కించుకున్నాడు.
ఇక హైపర్ ఆది పెళ్లి గురించి కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. గతంలో ఆది సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడని రకరకాల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వచ్చే యేడాదే తన పెళ్లి అంటూ ఆది షాక్ ఇచ్చేశాడు. తాను తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నానంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఇటీవల ఆది ఒక అమ్మాయిని ఒంగోలులో ఓ ఫంక్షన్లో కలిసి చనువుగా మాట్లాడడంతో పాటు సెల్ఫీలు దిగడంతో వాళ్ల పేరెంట్స్‌తోనే తన ముందు వీడియో కాల్ చేసి మాట్లాడడంతో దీనిపై పెద్ద చర్చే జరిగింది.
ఆ అమ్మాయి ఎవరు అని చాలా మంది ఆరాలు కూడా తీశారు. ఇక ఈ పెళ్లి పూర్తిగా మా అమ్మ నాన్నల ఇష్టం మీదే జరుగుతోందని… ఆ అమ్మాయి వాళ్లకు నచ్చడంతోనే ఈ పెళ్లికి లైన్ క్లీయర్ అయ్యిందని చెప్పుకొచ్చాడు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ అభిమాన నటుడు పెళ్లికొడుకు అవుతున్నాడంటూ ఆది ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు.