హైదరాబాద్‌లో రోజు రోజుకు డ్రగ్స్ సంస్కృతి విస్తరిస్తోంది. నిన్న మొన్నటి వరకు కాలేజీల్లో విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడడంతో పాటు మరి కొంతమంది సన్నిహితులను కూడా ఈ డ్రగ్స్‌కు అలవాటు పడేలా చేసేవారు. పోలీసులు ఉక్కు పాదం మోపడంతో రాచకొండ కమిషరేట్ పరిధితో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైతం ఈ డ్రగ్స్ దందా కొంత వరకు తగ్గుముఖం పట్టింది. ఇక ఇప్పుడు కరోనా నేపథ్యంలో పోలీసులు అంతా కరోనా హడావిడిలో ఉండడంతో మళ్లీ డ్రగ్స్ దందా జోరందుకుంది.
తాజాగా సికింద్రాబాద్ లో బోయిన్ పల్లి 300 గ్రాముల ఓపియం డ్రగ్ పట్టివేశారు. చివరకు డ్రగ్ మాఫియా ఎంతకు తెగించింది అంటే ఎవరికి అనుమానం రాకుండా చక్కెర తో కలిపి అమ్మకానికి ప్యాకెట్లు రెడీ చేస్తున్నారు. పేరుకు పైకి పంచదారగా ఉండడంతో ఎవ్వరికి అనుమానం రావడం లేదు. కానీ లోపల మాత్రం డ్రగ్స్ అమ్మేస్తున్నారు. లాక్ డౌన్ లో వ్యాపారం లాస్ రావడం తో ఈ మార్గాన్ని ఎంచుకున్న హనుమాన్ రాం అనే వ్యాపారి చెప్పాడు.