1980వ దశకంలో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన రాశీ ఆ తర్వాత హీరోయిన్‌గా ఎదిగి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అప్పట్లో మీడియం రేంజ్ హీరోలకు ఆమె సరైన హీరోయిన్. బాలయ్య, పవన్ కళ్యాన్ లాంటి అగ్ర హీరోలతో కూడా ఆమె నటించింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె నటనకు అప్పట్లో కుర్రకారు ఫిదా అయిపోయేవారు. ఏడెనిమిదేళ్ల పాటు టాప్ హీరోయిన్‌గా కొనసాగిన ఆమె ఆ తర్వాత సడెన్‌గా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు.
ఆ తర్వాత ఆమెకు వందల కోట్ల ఆస్తి ఉన్న సంబంధాలు వచ్చినా వాటిని కాదని.. తాను ప్రేమించిన సహాయ దర్శకుడు మునినే పెళ్లి చేసుకుంది. ఆమె హైదరాబాద్ సెటిల్ అవ్వడంతో పాటు ఆమె సొంతంగా బిజినెస్ చేసుకుంటూ కోట్లు సంపాదిస్తోంది. ఆమె భర్త ముని ఎవరో కాదు రాశీ హీరోయిన్‌గా నటించిన పలు సినిమాలకు అతడు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. రాశీకి మంచి సంబంధాలు చూస్తోన్న సమయంలో ఆమె తండ్రి ఆకస్మాత్తుగా చనిపోవడంతో ఆమెకు ముని ధైర్యం చెప్పాడట.
ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి .. చివరకు ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన ఆమె ఆ తర్వాత బుల్లితెర మీద అప్పుడప్పు సందడి చేస్తోంది.