కరోనా వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా కీలక వ్యవ్థలన్నీ తీవ్ర సంక్షభం ఎదుర్కొంటున్నాయి. అందులో సినీ పరిశ్రమ, అందులో పనిచేసే కార్మికులు మరీ గడ్డు పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు. వీరిని ఆదు కోవడానికి ఇప్పటి వరకు ప్రభుత్వాలు చేసింది శూన్యం. సెలబ్రిటీలే ఒక్కొక్కరుగా ముందుకొచ్చి వీరి కోసం భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచారు. దక్షిణ సినీ కార్మికుల సమాఖ్యలోని కార్మికులను ఆదుకునేందుకు రు. 1.5 కోట్లు డొనేషన్ ఇస్టున్నట్లు ప్రకటించారు.
సూర్య నటిస్తున్న తాజా చిత్రం `ఆకాశం నీ హద్దురా` చిత్ర బిజినెస్ ద్వారా వచ్చే 5 కోట్లను కరోనా వ్యాప్తి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వారికి అందజేస్తానని గతంలో సూర్య మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సినిమా బిజినెస్ ద్వారా వచ్చిన 1.5 కోట్లను మొదటి విడత సహాయంగా అందజేశారు. ఈ మొత్తంలో ఫెఫ్సీ ప్రెసిడెంట్ ఆర్.కె. సెల్వమణికి భారతీరాజా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో 80 లక్షల చెక్కుని, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు 30 లక్షల చెక్కుని నిర్మాత కలైపులి ఎస్ థానుకు, నడిగర్ సంఘానికి 20 లక్షల చెక్కుని హీరో సూర్య తండ్రి శివకుమార్ అందజేశారు.
సూర్య నటించిన తాజా చిత్రం `ఆకాశమే నీహద్దు రా` అక్టొబర్ 30న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు 200 దేశాల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జిఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.