Moviesబ్రేకింగ్‌: స్టార్ హీరో మృతి

బ్రేకింగ్‌: స్టార్ హీరో మృతి

ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు చాడ్విక్ బోస్‌మాన్‌(43) కన్నుమూశారు. బోస్‌మాన్ గ‌త కొంత కాలంగా కోల‌న్ ( పెద్ద‌పేగు) క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడు. బోస్‌మాన్ మృతిని అత‌డి కుటుంబ స‌భ్యులు కూడా ధృవీక‌రించారు. చాడ్విక్ బోస్‌మాన్ మృతిపై అత‌డి కుటుంబ స‌భ్యులు మాట్లాడుతూ నిజ‌మైన పోరాట యోధుడు.. మీరు ఎంతో ప్రేమించిన సినిమాల‌తో మీ ముందుకు వ‌చ్చాడ‌ని.. ఈ రోజు ఇంట్లోనే అత‌డు మృతి చెంద‌డం మ‌నంద‌రికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు. చాడ్విక్ బోస్‌మాన్ 2016 నుంచి స్టేజ్ త్రీ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడు.

బోస్‌మాన్‌ దక్షిణ కరోలినాలోని అండర్సన్‌లో పుట్టి పెరిగాడు. 2013లో లెజండరీ బేస్ బాల్ ఆటగాడు జాకీ రాబిన్సన్ కథతో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా 42తో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత 2016లో వ‌చ్చిన కెప్టెన్ అమెరికా:  సివిల్ వార్‌లో మార్వెల్ సూప‌ర్ హీరో బ్లాక్ పాంథ‌ర్‌గా క‌నిపించాడు. ఆ త‌ర్వాతే అత‌డి ఇంటిపేరు బోస్‌మాన్‌గా మారింది.

ఆ తర్వాత 2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాది ఆరంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డా 5 బ్లడ్స్‌లో చాడ్విక్‌ చివరి సారిగా కనిపించారు. బోస్మాన్ చివరి సారిగా ఆగస్టు 12న ట్వీట్‌ చేశాడు. డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ నామినీ కమలా హారిస్ నామినేషన్‌ను అభినందిస్తూ ఈ ట్వీట్‌ చేశాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news