టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త బెజవాడతో పాటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తన సినిమాలేంటో తన లోకం ఏంటో బిజీగా ఉండే రామ్ తాజాగా విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ( రమేష్ హాస్పటల్‌కు అనుబంధంగా నిర్వహిస్తోన్న కోవిడ్ సెంటర్) అగ్ని ప్రమాదం జరిగి 10 మంది కరోనా రోగులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అధికారులు రమేష్ హాస్పటల్ నిర్వాహకురాలిగా టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు రాయపాటి మమతను సైతం విచారించారు. ఇక హాస్పటల్ ఎండీ రమేష్ ఇప్పటకీ పరారీలో ఉన్నారు.
దీంతో ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేని హోటల్‌కు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై స్పందించిన హీరో రామ్ స్వర్ణ ప్యాలెస్ హోటల్ అగ్ని ప్రమాద విషయం లో పెద్ద కుంభకోణమే జరుగుతోందని.. ఈ సంఘటనలో కొందరు సీఎం జగన్‌కు ఇస్తోన్న రాంగ్ సమాచారంతో మీ గౌరవానికి, మీపై మేం పెంచుకున్న నమ్మకానికి మాయని మచ్చ ఏర్పడుతుందని సంచలన ట్వీట్ చేశాడు.
అలాగే మీ వెనక గోతులు తీసే వ్యక్తులను తెలుసుకుంటారని ఆశిస్తున్నాం అని పోస్ట్ చేశాడు. ఈ విషయంలో రమేష్ హాస్పటల్ ఎండీ రామ్‌కు పెదనాన్న కావడంతో రామ్ కాస్త ఆవేశంతో స్పందించాడని అంటున్నారు. ఇక మరి కొందరు మాత్రం వైసీపీలోకి వెళతాడని పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇదంతా విజయవాడలో బాగా హాట్ టాపిక్‌గా మారింది. శనివారం ఉదయం విజయవాడలో పలువురు వైసీపీ నేతలు రామ్ వైసీపీలోకి వెళ్లవచ్చంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ పోస్టులపై రామ్ నెక్ట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో ? చూడాలి.